హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

by సూర్య | Wed, Jan 07, 2026, 01:13 PM

మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రేతల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు కేసు నమోదైంది.నాటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.గత ఏడాది డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగుచూసింది. నెల రోజుల వ్యవధిలో అమన్ ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM