అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు

by సూర్య | Wed, Dec 10, 2025, 10:11 PM

ఈ నెల 12న విడుదలకాబోయే అఖండ 2 (Akhanda 2 Release Date) సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఆమోదం తెలిపింది.ప్రత్యేక షోలకు టికెట్ ధర రూ.600 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెసులుబాటు డిసెంబర్ 12 నుంచి 14 వరకు వర్తిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షో బుకింగ్స్ గురువారం ప్రారంభమవ్వనున్నాయి.ఇంకా, సింగిల్ స్క్రీన్‌ల్లో టికెట్ ధరలను రూ.50 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించగా, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మూడు రోజుల పాటు పెరిగిన ధరలు కొనసాగుతాయి. అయితే, పెరిగిన ఆదాయంలో 20% భాగం కార్మికుల సంక్షేమానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సొమ్మును తప్పనిసరిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (TFIEWA) ఖాతాలో జమ చేయాలి అని స్పష్టత ఇచ్చింది.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM