'దేవగుడి' మూవీ టీజర్ విడుదల

by సూర్య | Fri, Nov 14, 2025, 04:22 PM

బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు షేక్ మదీన్, రఘు కుంచె సంగీతం అందించారు. డిసెంబర్ 19న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ను సీనియర్ నటుడు శ్రీకాంత్ ఆవిష్కరించారు. టీజర్ ఆవిష్కరణ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, '2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. అలానే ఆయన దర్శకుడు అయ్యారు. ఇప్పుడు ఆయన రూపొందించిన 'దేవగుడి' టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మగారు పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన సంఘటనలతో తెరకెక్కిన సినిమా ఇది' అని అన్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM