‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’

by సూర్య | Fri, Nov 14, 2025, 04:21 PM

భూతకోళ అంటూ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో కన్నడ నుంచి మరో చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ సాపల్య నిర్మాత.  గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల మంగళూరులో ఆడియో ఆవిష్కరణ  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించడం, కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్‌లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ ' మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. అందరినీ సర్ ప్రైజ్ చేసేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM