విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌

by సూర్య | Fri, Nov 14, 2025, 04:19 PM

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి సరసన ‘జై భీమ్‌’ హీరోయిన్‌ లిజోమోల్‌ జోస్‌ నటించనున్నారు. బాలాజీ ధరణీధరన్‌ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే చెన్నైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా మలయాళ భామ లిజోమోల్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు అట్లీ తన సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కిస్తున్నారు. ‘నడువుల కొంజెం పక్కత్త కాణోం’, ‘సీతక్కాది’ వంటి చిత్రాల తర్వాత విజయ్‌ సేతుపతి - దర్శకుడు బాలాజీ కాంబోలో రానున్న మూడో చిత్రం. టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

Latest News
 
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM