ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారం లో సీఐడీ కార్యాలయంలో ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నిస్తున్న అధికారులు

by సూర్య | Wed, Nov 12, 2025, 07:14 PM

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో నటుడు విజయ్ దేవరకొండను నిన్న విచారించారు. ఈ కేసులో ప్రకాశ్ రాజ్ జులై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు.బెట్టింగ్ యాప్‌లకు కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు. ఈ యాప్‌లకు బానిసలైన కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు.

Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM