|
|
by సూర్య | Wed, Nov 12, 2025, 04:49 PM
నటుడు గోవిందా (61) తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను బాగానే ఉన్నట్లు వెల్లడించారు. వర్కౌట్లు చేయడం వల్ల తాను అలసిపోయానని తెలిపారు.వర్కౌట్ల కంటే యోగా, ప్రాణాయామం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. యోగా, ప్రాణాయామానికి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు.గోవిందా గత నెల రోజులుగా చాలా బిజీగా ఉంటున్నారని, అందువల్ల ఇలా జరిగి ఉండవచ్చని గోవిందా స్నేహితుడు, లాయర్ బిందాల్ వెల్లడించారు.
Latest News