దిల్ రాజు - పవన్ కలయికతో రావిపూడి బంపర్ హిట్!”

by సూర్య | Mon, Oct 13, 2025, 09:06 PM

ఓజీ తర్వాత ఇక సినిమాలు చేయకపోవచ్చని భావించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు వరుసగా నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా దిల్ రాజుకి మాత్రం డేట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే  దిల్ రాజు ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌కు దర్శకుడిని ఫైనల్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకం, గౌరవం కారణంగానే ఆ డేట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పవన్‌తో ఒక సాలిడ్ సినిమా చేయగల దర్శకుడి కోసం దిల్ రాజు వెతుకులాట మొదలుపెట్టాడట.ఈ జాబితాలో అనిల్ రావిపూడి పేరు ముందంజలో ఉంది. ఇటీవల ‘భగవంత్ కేసరి’ లాంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాక, నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో కూడా అలాంటి సోషల్ మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడట.గతంలో దిల్ రాజు నిర్మించిన ‘వకీల్ సాబ్’ కూడా కొంతవరకు సామాజిక అంశాలపై ఆధారపడి విజయాన్ని సాధించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కూడా అదే తరహా ప్రభావవంతమైన సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, రావిపూడి ఫైనల్ కాకపోతే, ఆ తరువాత ఎవరు దర్శకుడు అవుతారనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్‌లో వేడి పుట్టిస్తోంది.

Latest News
 
నేడు సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి.. అరుదైన ఫోటోను పంచుకున్న మహేశ్ బాబు Sat, Nov 15, 2025, 01:51 PM
‘ఇట్లు మీ వెదవ’ ఈ నెల 21న విడుదల Sat, Nov 15, 2025, 10:48 AM
షూటింగ్ టైమ్ లో అలా చేయాలని ఒత్తిడి తెచ్చారు: చాందిని చౌదరి Sat, Nov 15, 2025, 10:37 AM
రామ్, అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా? Fri, Nov 14, 2025, 07:41 PM
బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన శివ రీ రిలీజ్ Fri, Nov 14, 2025, 07:41 PM