$5.4M మార్క్ కి చేరుకున్న 'OG' నార్త్ అమెరికా గ్రాస్

by సూర్య | Mon, Oct 06, 2025, 08:15 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'OG' సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల అయ్యింది. టాలెంటెడ్సు జీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్  బ్యానర్ విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా గ్రాస్ $5.4M మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. త్వరలో ఈ చిత్రం $6M క్లబ్ లో జాయిన్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Latest News
 
క్షేమంగానే ఉన్నానన్న గోవిందా Wed, Nov 12, 2025, 04:49 PM
'చంద్రముఖి' చిత్రం అప్పుడు అలా జరిగింది Wed, Nov 12, 2025, 04:47 PM
లైంగిక వేధింపుల కేసులో పలుకుబడిని ఉపయోగించి జానీ మాస్టర్ తప్పించుకోవాలని చూస్తున్నారు Wed, Nov 12, 2025, 04:29 PM
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఐన నటుడు ధర్మేంద్ర Wed, Nov 12, 2025, 04:26 PM
ఈ నెల‌ 14న విడుదల కానున్న 'కాంత' Wed, Nov 12, 2025, 04:24 PM