విశాఖలో మంకీపాక్స్‌ కలకలం

by సూర్య | Sat, Aug 06, 2022, 04:29 PM

భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగు చూసి ఆందోళన కలిగిస్తోన్న మంకీపాక్స్‌ ఇప్పుడు విశాఖ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది భీమిలి నియోజకవర్గంలో గీతం యూనివర్సిటీకి చెందిన ఓ మెడికోకు మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయని చెబతున్నారు వైద్యులు. ఇటీవలే హైదరాబాద్ నుండి 22 ఏళ్ల యువకుడు గీతం యూనివర్సిటీకి వచ్చాడు. అయితే, అతడిలో మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలను గుర్తించారు. ఆ తర్వాత గీతం ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే, ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి నలుగురు వైద్యుల బృందం సదరు యువకుడిని పరీక్షించడానికి వెళ్లగా. ఆ యువకుడు పరారయ్యాడు. దీంతో అధికారులకు కొత్త టెన్షన్‌ మొదలైంది. ఆ మెడికో వివరాలు సేకరించే పనిలో పడిపోయారు జిల్లా వైద్యాధికారులు.


అయితే, దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గురువారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సమావేశంలో వైరస్‌ను ఎదుర్కోవటానికి అత్యవసర వైద్య సహాయం గురించి ఆలోచనలు చేసింది. భారతదేశంలో ఇప్పటివరకు 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి, ఇందులో ఒకరు మరణించడం కూడా కలకలం రేపుతోంది. కోతులలో మొదట గుర్తించబడిన ఈ వైరస్ ప్రధానంగా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా జ్వరం, దద్దుర్లు, కణుపులు మరియు చీముతో నిండిన చర్మ గాయాలతో సహా తేలికపాటి లక్షణాలను కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ప్రజలు రెండు నుండి నాలుగు వారాలలోపు కోలుకున్నప్పటికీ. తీవ్రమైన కేసుల్లో పరిస్థితి మరోలా ఉంటుందని వెల్లడించింది.

Latest News

 
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ Sat, Apr 20, 2024, 12:28 PM
జగనన్న తోనే సంక్షేమాలు - చంద్రశేఖర్ Sat, Apr 20, 2024, 12:25 PM
వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు Sat, Apr 20, 2024, 12:24 PM
సివిల్ సర్వీస్ ర్యాంకర్ ను అభినందించిన ప్రకాశం ఎస్పీ Sat, Apr 20, 2024, 12:23 PM
కరవదిలో నాగసత్యలత, చందన ఎన్నికల ప్రచారం Sat, Apr 20, 2024, 12:21 PM