మెడికల్ షాపులపై కొరవడిన నిఘా

by సూర్య | Sat, Aug 06, 2022, 02:11 PM

యలమంచిలి పట్టణంలో మెడికల్ షాపులు పెరుగుతున్నాయని ప్రస్తుతం పట్టణంలో 12 మెడికల్ షాపులు ఉన్నా యని వీటిలో బీ-ఫార్మసీ సర్టిఫికెట్ కలిగిన వారు ఎవ్వరూ మందులు విక్రయించడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కనీసం వారు షాపులో కూడా ఉండటం లేదని మెడికల్ షాపుల్లో కనీస అవగాహన లేని వారు మందులు అమ్ముతున్నారని ప్రధానంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు విక్రయించరాదన్న నిబంధనను కూడా పాటించడంలేదని రోగులు అంటున్నారు. కానీ పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల్లో ఈ నిబంధన ఎవరూ పాటించడం లేదని ఎవరికి మందులు కావలసి వస్తే వారికి మందులు చీటీ లేకుండానే విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కొన్ని మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను మామూలు మందులుగా విక్రయిస్తుంటారు. మందులు ప్రభుత్వం తక్కువ ధరకే లభ్యమవ్వడమే కాకుండా ప్రతీ పట్నంలో ఒక అయితే జనరిక్ జనరిక్ మందుల షాపు ఉంటుంది కానీ యలమంచిలి పట్నంలో చాలా మెడికల్ షాపుల్లో జనరిక్ మం దులను మామూలు మందులు ధరలకు అమ్మకాలు జరపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనివల్ల మందులు కొనుక్కున్నవారు చాలా వరకు నష్టపోతున్నారని ప్రధానంగా యల మంచిలి పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులో మెడికల్ షాపులు ఉన్నా వాటికి అనుమతులు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి కానీ ప్రైవేట్ ఆస్పత్రి వారు మెడికల్ షాప్లో జనరిక్ మందులోనే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన వైద్యం చేయించుకున్న రోగులకు విపరీ తమైన ఖర్చు పెరుగుతోంది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్లు కూడా ఏర్పాటు చేస్తు న్నారు. ల్యాబ్ కు ప్రభుత్వం అనుమతి ఉండాలా లేదా అన్నది ఒక ప్రధానమైన అంశం క్రింద ఉంది.


యలమంచిలి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఒకే ఒక్క ల్యాబ్క టెస్టులు రిఫర్ చేస్తున్నారని దీనిపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని అలాగే మెడికల్ షాపుల్లో కనీస అవగాహన లేకుండా మందులు విక్రయించడం వల్ల రోగికి ఒక వ్యాధి నుండి మరో వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని దీనిని డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రహించి మెడికల్ షాపులపై పూర్తి నియంత్రణ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధానంగా మెడికల్ షాపుల్లో బి ఫార్మసీ సర్టిఫి కెట్లు గలవారు ఉండాలా లేదా అన్నది ముఖ్య అంశంగా ఉందని కానీ బి ఫార్మసీ సర్టిఫికెట్ కలవారు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వారి పేరు మీద షాప్కి దరఖాస్తు పెట్టుకుని సంబంధం లేని వ్యక్తులతో మెడికల్ దుకాణాలు ద్వారా వ్యాపారం చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతి వారం ఒక ప్రముఖ వైద్యుని తీసుకువచ్చి భారీగా ప్రజల నుండి నగదు దోచేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా డ్రగఇన్స్పెక్టర్ స్పందించి మెడికల్ షాపులపై నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM