పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య

by సూర్య | Sat, Aug 06, 2022, 01:59 PM

పురుగులు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి లక్కవరపుకోట సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథ వెంకన్న (41) తమ కుటుంబంతో కలసి లక్కవరపుకోట మండల కేంద్రంలో నివాసముంటున్నాడు.


ఇటీవల వెంకన్న అనారోగ్యం బారిన పడటంతో పాటుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం తన ఇంట్లో ఉన్న పురుగులు మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంకన్నను హుటాహుటిన విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. మృతుడి కుమార్తె సత్యవేణి ఫిర్యాదు మేరకు లక్కవరపుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM