బొబ్బిలి లొ ఏసీబీకు చేతికి చిక్కిన 40 భవనాల అక్రమ నిర్మాణం

by సూర్య | Sat, Aug 06, 2022, 01:58 PM

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం లో రెండోరోజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ సిఐలు మహేష్, వెంకట్రావు, ఎస్సై వాసుదేవరావు లో ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రామరాజ్యం ఆసుపత్రి దరిలో రెండు భవన నిర్మాణాలను రహదారి భవనాల శాఖ, గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో కొలతలు వేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికా రులు భవన నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? ప్రభుత్వానికి చెల్లించ వలసిన ఫీజులు చెల్లించారా లేదా? భవన నిర్మాణ యజమానులు ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారు, నిబంధన ప్రకారం నిర్మాణాలు చేపట్టేరా, లేదా, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. వి ఎల్ టి టాక్స్, పీనల్ చార్జెస్ వాటిపై ఆడిట్ చేపట్టి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని తెలిపారు. బి పి ఎస్, సెట్ బ్యాక్ వంటి అనుమతులు పలుభవన నిర్మానులు పాటించలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. బొబ్బిలి మున్సిపల్ నుండి 400 మంది వరకు భవన నిర్మాణాలకు అనుమతులకు దరఖాస్తులు చేశారని, అందులో కొన్ని దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు రిజెక్ట్ చేశారని, 240 దరఖాస్తుల వరకు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, మరో ఇచ్చిన 91 మంది అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, 75 మందికి నోటీసులు కూడా జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు విలేకరులకు తెలిపారు.


పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. మరిన్ని సోదాలు జరపున్నట్టు ఈ సందర్గంగా తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజల నుండి లంచాలు డిమాండ్ చేస్తే అటువంటి అధికారులపై ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 14400 ప్రవేశపెట్టిందని టోల్ ఫ్రీ నెంబర్ కు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై పలు ఫిర్యాదులు రావడంతో ఫిర్యాదులపై గురువారం అర్ధరాత్రి వరకు ఏసీబీ డిఎస్పి రామచంద్ర రావు ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో పట్టణ ప్రణాళిక విభాగం లో పలు రికార్డులను పట్టణ ప్రణాళిక విభాగంలో కొన్ని రికార్డులు సోదాలు చేసిన విషయం విధితమే.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM