ఆదిత్యా బిర్లా ఫ్యాఫన్స్ మహిళలకు ఉద్యోగ అవకాశాలు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:48 PM

పులివెందుల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కడప - వైఎస్సార్ జిల్లా ఉపాధి కల్పన, వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్స్ కంపెనీలో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పులివెందుల ఏపీఎం గురురాజు, జాబ్ కో ఆర్డినేటర్ దివాకర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతి ఆపై చదివి, 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాలలోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతులు ఈనెల 8, 9, 10 తేదీలలో ఏపీకార్లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ ఒరిజనల్, జిరాక్స్ కాపీలు, ఫోటోలు తీసుకురావాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు 6302702399, 9640015507లను సంప్రదించాలన్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM