by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా లఫాయెట్ పార్కులో పిడుగు పడింది. ఘటన జరిగిన వెంటనే యూఎస్ పార్కు పోలీసులతో పాటు, సీక్రెట్ సర్వీసులు అక్కడికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పార్కును మూసేశారు.
Latest News