గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం

by సూర్య | Sat, Aug 06, 2022, 12:37 PM

క‌డ‌ప న‌గ‌రంలోని 15వ డివిజ‌న్‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ వెళ్లి.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరును అడిగి తెలుసుకున్నారు. 


అయన మాట్లాడుతూ...అర్హ‌త ఒక్క‌టే ప్రామాణికంగా అంద‌రికీ సంతృప్త‌స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని,  ప‌థ‌కాల అమ‌లులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. 


ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో ఏ మేర‌కు ల‌బ్ధిపొందారో ప్ర‌తి గ‌డ‌ప‌కూ వివ‌రించారు. ప్ర‌జ‌లు ఇంకేమైనా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు, డివిజ‌న్ కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, స‌చివాల‌య సిబ్బంది పాల్గొన్నారు. 

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM