కరోనా పై ఒక భయంకరమైన నిజం

by సూర్య | Sat, Aug 06, 2022, 12:33 PM

కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో క్రొత్తగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నెదర్లాండ్స్‌లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 


కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు.


12 శాతానికి పైగా, అంటే ప్రతి 8 మందిలో ఒకరు తాము దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయితే ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకడం లేదని సర్వేలో తేలడం విశేషం. 


ఈ విషయంలో మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు మరింత సమగ్రమైన డేటా అవసరం చాలా ఉందని నెదర్లాండ్స్‌లోని గ్రొనింజెన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ జుడిత్‌ రొస్మలెన్‌ అన్నారు.    

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM