వైద్య శాఖలో క్రొత్తగా నోటిఫికేషన్‌ జారీ

by సూర్య | Sat, Aug 06, 2022, 12:09 PM

వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎం జగన్  ప్రభుత్వంలో  రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. 


ఇందులో భాగంగా గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి  10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది కాగా  మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 


ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లలో తెలియజేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM