ఎలక్ట్రిక్‌ బైక్‌ తో తస్మాత్ జాగర్త

by సూర్య | Sat, Aug 06, 2022, 12:07 PM

ఎలక్ట్రిక్‌ బైక్‌ ఛార్జింగ్ పెట్టి ఉన్న సమయంలో పేలినట్లు వచ్చిన వార్తలు నిజమని తెలిస్తుంది. వివరాల్లోకి వెళ్ళితే... ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలిన ఘటన శుక్రవారం కందుకూరు పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన ఆరీఫ్‌ అనే వ్యక్తి ‘ఎకోతేజా’ అనే కంపెనీకి చెందిన విద్యుత్‌ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. 


శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్‌ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM