త్వరితగతిన పెండింగ్ కేసులలో విచారణను పూర్తి చెయ్యండి

by సూర్య | Sat, Aug 06, 2022, 10:36 AM

వార్షిక తనిఖీలలో భాగంగా కాకినాడ జిల్లా,  పెదపూడి పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీలు నిర్వహించిన జిల్లా SP M. రవీంద్రనాథ్ బాబు IPS., ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలి అని  SP సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., వార్షిక తనిఖీలలో భాగంగా కాకినాడ సబ్ డివిజన్ రూరల్ సర్కిల్ పరిధిలోని పెదపూడి పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఎస్పీ పోలీస్ స్టేషన్ ప్రాంగణ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ ప్రాంగణంలో ఉన్న అన్ క్లైమ్డ్ ప్రాపర్టీ ను చట్టపరమైన ప్రక్రియ పాటించి ఆక్షన్ నిర్వహించాలని సూచించారు.


తదుపరి స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్ కౌంటర్, రికార్డుల నిర్వహణ, రిపోర్టు కాబడిన మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులను విశ్లేషించి త్వరితగతిన పెండింగ్ కేసులలో విచారణను పూర్తి చేయాలని తెలియజేశారు. స్టేషన్ లో నమోదైన ప్రాపర్టీ కేసులలో చోరి సొత్తు రికవరీ శాతం 98% ఉండటం పట్ల SP గారు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ పెదపూడి పోలీస్ స్టేషన్ పనితీరు,రికార్డుల నిర్వహణ SI & సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట కాకినాడ SDPO V. భీమారావు, కాకినాడ రూరల్ CI శ్రీనివాస్, పెదపూడి SI వాసు, మహిళా పోలీసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM