నేడే ఉప రాష్ట్రపతి ఎన్నికలు..ఫలితాలు కూడా ఇదే రోజు

by సూర్య | Sat, Aug 06, 2022, 04:12 AM

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తయి తాజాగా భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ రేపు (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంటులోని ఉభ‌య స‌భ‌ల స‌భ్యులు ఈ పోలింగ్‌లో పాల్గొన‌నున్నారు. పార్ల‌మెంటు భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని 63వ నెంబ‌రు గ‌దిలో ఈ పోలింగ్ కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు మొద‌లు కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్న ఎన్నిక‌ల సంఘం రాత్రికి ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌నుంది.


ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌లో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన మొత్తం 790 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌ల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేప‌థ్యంలో రేప‌టి ఉప‌రాష్ట్రప‌తి పోలింగ్‌కు 788 మందికి మాత్ర‌మే ఓటు హక్కు వుంది. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM