సిగ్గూ వాళ్లకకి లేదా...? లేక మనకి లేదా

by సూర్య | Sat, Aug 06, 2022, 04:11 AM

వైసీపీపై టీడీపీ నాయకత్వం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ హాజరవడంపై టీడీపీ మండిపడింది. 'దేశం సిగ్గు పడే పని చేసిన గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేస్తున్నాం అని లీకులు ఇచ్చారు.. కట్ చేస్తే, ఈ రోజు ఢిల్లీలో పార్టీ సమావేశాలకు ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారు. సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ?' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాధవ్ హాజరైన ఫోటోను కూడా టీడీపీ పోస్ట్ చేసింది. ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావడం, దానిని ఆయన మార్ఫింగ్ వీడియో అంటూ ఖండించడం విదితమే.  

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM