అయోధ్యలో రామలయ నిర్మాణానికి వ్యతిరేకంగా వారి నిరసన: అమిత్ షా

by సూర్య | Sat, Aug 06, 2022, 04:10 AM

అయోధ్యలో నిర్మితమవుతున్న రామలయం నిర్మానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నల్లదుస్తులతో నిరసన తెలిపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ అగ్రనేతలు దేశరాజధాని ఢిల్లీలో నల్లదుస్తులతో నిరసనలు తెలపడం తెలిసిందే. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో రాష్ట్రపతి భవన్ కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల నిరసనలు ఉద్రిక్తతలను కలుగజేశాయి. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, కాంగ్రెస్ నిరసనలకు కొత్త భాష్యం చెప్పారు. 


గతేడాది అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజు నేడని, అందుకే కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారని, వారి నిరసనలు రామాలయానికి వ్యతిరేకంగానే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఈ నిరసనలే నిదర్శనమని అమిత్ షా విమర్శించారు. 


"కోర్టులో నమోదైనే కేసులకు వ్యతిరేకంగానే ఈ నిరసనలు. ఎందుకు ప్రతిరోజూ నిరసనలు తెలుపుతున్నారు? చూస్తుంటే కాంగ్రెస్ ఏదో రహస్య అజెండాతో పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. వారు తమ బుజ్జగింపు రాజకీయాలకు కొత్త ముసుగు తొడిగారు. ఇవాళ ఈడీ ఎవరికీ సమన్లు కూడా జారీచేయలేదే! ఎవరినీ ప్రశ్నించలేదే! ఈడీ ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు కూడా లేవే! మరి నేడు కాంగ్రెస్ ఏం ఆశించి ధర్నా చేపట్టిందో అర్థంకావడంలేదు. 


ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామజన్మభూమి వద్ద మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది అయ్యింది. 550 ఏళ్ల జటిల సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపారు. దేశంలో ఎక్కడో ఒకచోట హింసను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పించారు. కాంగ్రెస్ కు చెప్పేది ఒక్కటే... బుజ్జగింపు విధానం దేశానికి, కాంగ్రెస్ కు మంచిది కాదు" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

Latest News

 
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM
మురుగునీరు వెళ్లడానికి దారి లేక కాలనీలో అవస్థలు Fri, Mar 29, 2024, 02:50 PM