పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయండి: వై.ఎస్.జగన్ పిలుపు

by సూర్య | Sat, Aug 06, 2022, 04:08 AM

2024 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వైసీపీ శ్రేణుల‌తో స‌మావేశాల్లో భాగంగా శుక్ర‌వారం ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ భేటీకి రాజాం నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత కంబాల జోగులుతో పాటు ఆ నియోజ‌కవ‌ర్గానికి చెందిన 50 మంది పార్టీ కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా 2024 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. కంబాల జోగులును మ‌రోమారు గెలిపించాల‌ని ఆయ‌న సూచించారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి మరింత మేర నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. ఈ త‌ర‌హా భేటీల్లో భాగంగా గురువారం కుప్పం నియోజ‌కవ‌ర్గ నేత‌ల‌తో జ‌గ‌న్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM