వేచిచూడటం కాదు సాధించడం చేయాలి: కంగనా రనౌత్

by సూర్య | Sat, Aug 06, 2022, 04:05 AM

స్త్రీలు తమ వంతు వచ్చే వరకు వేచి చూడడం కాకుండా, వారే దాన్ని స్వయంగా సాధించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. జీవితంలో ఆచరించదగిన చక్కని మంత్రాన్ని ఆమె ఉపదేశించింది. గతంలో తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ఆమె విడుదల చేసింది. స్త్రీలు తమ వంతు వచ్చే వరకు వేచి చూడడం కాకుండా, వారే దాన్ని స్వయంగా సాధించాలని సూచించింది.  


"అవమానాలు, వైపల్యాలు, అనుచిత ప్రవర్తన వంటి భావోద్వేగాలను ఉపయోగించుకోవడం నాకు నచ్చదు. ఈ తరహా అనుభవాలతో మన లక్ష్యాలు, సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇంధనంగా ఉపయోగించుకోవాలి. మిమ్మల్ని అభినందించలేని వారి కళ్లలోంచి చూడకండి. వారి విమర్శలను మీరు ఎదగడానికి ఉపయోగించుకోండి. మీరు ఎదుగుతున్న క్రమంలో వారిని చూసి ఆనందించడం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఎవరైతే విలన్లుగా ఉండాలని అనుకుంటారో.. వారిని కమెడియన్లుగా మార్చేయండి. ఇదే చక్కని స్టోరీ’’ అని కంగన సూచించింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM