రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సివస్తాది: చంద్రబాబు నాయుడు

by సూర్య | Sat, Aug 06, 2022, 04:04 AM

 పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుందని టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.వైసీపీ ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని చంద్రబాబు అన్నారు. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం వారి కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని అన్నారు.


 వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరినీ విడుదల చెయ్యాలని అన్నారు. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM