అది పెద్దల సభకు అవమానం కాదా: వర్ల రామయ్య

by సూర్య | Sat, Aug 06, 2022, 04:03 AM

నేర చరిత్రను కలిగిన వ్యక్తి, అంతటి రాజ్యసభకు అధ్యక్షత వహించడం విడ్డూరం కదూ? పెద్దల సభకు అవమానం కదూ?' అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత  వర్ల రామయ్య విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభకు కాసేపు అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఛైర్మన్ ఛైర్ లో కూర్చొని సభను నడిపించారు. దీనిపై వర్ల రామయ్య స్పందిస్తూ విజయసాయిపై విమర్శలు గుప్పించారు. 


'ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఎన్నో కేసుల్లో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ, భారతదేశంలో ఏ2 గా గుర్తించబడిన విజయసాయి రెడ్డి, నిన్న రాజ్యసభకు అధ్యక్షత వహించి సభను నడిపించారట! ఇంతటి నేర చరిత్రను కలిగిన వ్యక్తి, అంతటి రాజ్యసభకు అధ్యక్షత వహించడం విడ్డూరం కదూ? పెద్దల సభకు అవమానం కదూ?' అని విమర్శించారు. 


మరోవైపు రాజ్యసభకు అధ్యక్షత వహించడంపై విజయసాయి సంతోషాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడ్ని ఉండేవాడ్నని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందని వివరించారు. ఇదంతా కూడా జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM