గంజాయి కొట్టి..ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడుకొన్నారు

by సూర్య | Sat, Aug 06, 2022, 03:40 AM

తాగుబోతులే కాదు మన దేశంలో గంజాయి తాగేవారితో కూడా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  మలికిపురం మండలం మల్కిపురం సెంటర్‌లో యువకులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు టైర్ల కింద పడుకుని అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. ఈ యువకుల దెబ్బకు అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికులు వారికి నచ్చజెప్పినా వినలేదు.. టైర్ల దగ్గర నుంచి పక్కకు తప్పుకోలేదు. స్థానికులు పోలీసుకులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. టైర్ల కింద నుంచి డ్రగ్స్ మత్తులో ఉన్న యువకులను బయటకు లాగి నాలుగు తగలించారు. యువకుల్ని మెడికల్ టెస్టులకు పంపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ యువకులు గతంలో పలు కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ యువకులు గంజాయి మత్తులో ఇలా ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM