పార్లమెంటులో ఆసక్తికర ప్రైవేటు బిల్లులు పెట్టిన విజయసాయిరెడ్డి

by సూర్య | Fri, Aug 05, 2022, 11:12 PM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో మూడు ప్రైవేట్ బిల్లులను ప్ర‌తిపాదించారు. దేశంలోని ఏదేని రాష్ట్రానికి ఒక‌టి అంత‌కంటే ఎక్కువ రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే క‌ట్ట‌బెట్టేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ఇక రెండో బిల్లు విష‌యానికి వ‌స్తే... రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వులు స‌హా ఇత‌ర రాజ్యాంగబ‌ద్ధ ఎన్నిక‌ల్లో పాలుపంచుకునేలా ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు త‌ప్ప‌నిస‌రిగా బెయిల్ ఇవ్వాల‌ని రెండో బిల్లులో సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు.


ఇక మూడో బిల్లు విష‌యానికి వ‌స్తే... అస‌త్య వార్త‌లు ప్ర‌చురించే మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స‌ర్వాధికారాలు క‌ట్టేబెట్టేందుకు ఉద్దేశించిన మ‌రో బిల్లును సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు. అంతేకాకుండా డిజిట‌ల్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు. ఈ బిల్లులో "ఆల్ బ‌యాస్‌డ్ న్యూస్" వార్త‌లు ప్ర‌సారం చేసే ఛానెళ్లు అంటూ పేర్కొన్న ఆయ‌న వాటిని "ఏబీఎన్ ఛానెల్స్‌"గా పేర్కొన్నారు.

Latest News

 
ప్రధాని మోదీతో ఓపెన్ ఏఐ సీఈఓ భేటీ,,,ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆల్ట్‌మన్ Fri, Jun 09, 2023, 10:38 PM
అసలు నారా లోకేష్ ఎవరు... పేర్ని నాని Fri, Jun 09, 2023, 10:03 PM
వైసీపీ నేతలతో ముద్రగడ పద్మనాభం భేటీ,,,,రాజకీయ వర్గాల్లో ఆసక్తిికర చర్చ Fri, Jun 09, 2023, 10:02 PM
జూన్ 12న లొంగిపోవాలని మాగుంట రాఘవకు సుప్రీం కోర్టు ఆదేశం Fri, Jun 09, 2023, 10:01 PM
విధి నిర్వహణలో నిబద్దతకు వందనాలు,,,వీఆర్వో మీనాపై నారా లోకేష్ ప్రశంసలు Fri, Jun 09, 2023, 10:01 PM