గోరంట్ల మాధవ్ పై చింతకాలయ విజయ్ పరువునష్టం దావా

by సూర్య | Fri, Aug 05, 2022, 10:42 PM

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకాల్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకొంటోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పరువు నష్టం దావా వేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగించారంటూ రూ. 50 లక్షల పరువు నష్టం దావా వేయనున్నారు. దీనికి సంబంధించి తన లాయర్ ద్వారా ఆయనకు లీగల్ నోటీసు పంపించారు. లీగల్ నోటీసుకు వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో ఆయన పేర్కొన్నారు.  


ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ గోరంట్ల మాధవ్ కు సంబంధించి ఒక వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అది మార్ఫింగ్ వీడియో అని, ఆ వీడియో బయటకు రావడం వెనుక చింతకాయల విజయ్ పాత్ర ఉందని నిన్న గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ... ఆయన నగ్న వీడియోతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. ఆయన ఇంట్లోని బ్యాక్ గ్రౌండ్, ఇతర పరిసరాలను మార్ఫింగ్ చేయగలమా? అని అడిగారు. అడ్డంగా దొరికిపోయి, మార్ఫింగ్ చేశారంటూ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. ఆయన జిమ్ వీడియోలు చూసి తరించడానికి ఆయనేమైనా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూసా? అని ప్రశ్నించారు. ఆయన నగ్న వీడియోలు చూసి తరించడానికే తాము బతికున్నామా? అని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నగ్న వీడియోలు చేసి... మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Latest News

 
ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసిన సర్పంచి దంపతులు Sun, Aug 14, 2022, 12:26 PM
తప్పిన రైలు ప్రమాదం Sun, Aug 14, 2022, 12:25 PM
ప్రతి గడప గడపకు జగనన్న సంక్షేమ పథకాలు: మంత్రి ఉషాశ్రీచరణ్ Sun, Aug 14, 2022, 12:24 PM
ప్రశాంతంగా ఏపీ టెట్ Sun, Aug 14, 2022, 11:16 AM
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సన్మానం Sun, Aug 14, 2022, 11:16 AM