అలాంటి కేటుగాళ్లు మాపై విమర్శలు చేయడమా: శ్రీకాంత్ రెడ్డి

by సూర్య | Fri, Aug 05, 2022, 10:41 PM

టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై స్పందిస్తూ ఆయన టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. ఇదిలావుంటే గోరంట్లా మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఇదే అదనుగా టీడీపీ నేతలు వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఈ అంశంపై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మాధవ్ తప్పు చేశాడని తేలితే అతడిపై పార్టీపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. అయినా టీడీపీ వాళ్లు గాంధీ మహాత్ముల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. నాడు టీడీపీ ప్రజాప్రతినిధులే విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారని, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటి కేటుగాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM