ఆ రెండు మధుర ఘటనలను షేర్ చేసిన వైసీపీ ఎంపీ

by సూర్య | Fri, Aug 05, 2022, 10:19 PM

పార్లమెంటులో ఇటీవల చోటు చేసుకొన్న  రెండు ఘటనలను వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కిందంటూ ఆ పార్టీ యువ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌రత్ శుక్ర‌వారం చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన రెండు ఫొటోల‌ను కూడా ఆయ‌న పంచుకున్నారు. లోక్ స‌భలో ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇటీవ‌లే లోక్ స‌భ‌ను కొద్దిసేపు న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత గురువారం రాజ్య‌స‌భ ప్యానెల్ చైర్మ‌న్ హోదాలో వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి కూడా రాజ్య‌స‌భ‌ను కాసేపు న‌డిపించారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేసిన మార్గాని భ‌ర‌త్‌... ఈ త‌ర‌హా ప‌రిణామం ఉభ‌య స‌భ‌ల్లో జ‌గ‌న్‌కు, వైసీపీకి ద‌క్కిన గౌర‌వ‌మేన‌ని పేర్కొన్నారు. 

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM