రైల్వే ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

by సూర్య | Fri, Aug 05, 2022, 03:29 PM

ఖర్గపూర్‌ నుంచి విజయవాడ (1115 కి.మీ)కు ప్రతిపాదించిన ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ-ఇటార్సీ (975 కి.మీ) మధ్య ప్రతిపాదించిన నార్త్‌ సౌత్‌ సబ్‌ కారిడార్‌కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. విజయవాడ గుండా వెళ్లే రెండు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లకు సంబంధించి సర్వే, డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) రూపొందించే పనులు పురోగతిలో ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.


ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదని అన్నారు. సర్వే, డీపీఆర్‌ పూర్తయిన తర్వాత సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాల ప్రాతిపదికపై మాత్రమే ఏ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌నైనా మంజూరు చేయడం జరుగుతుందని కేంద్ర‌మంత్రి తెలిపారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM