అడ్డంగా దొరికిన ఎంపీ పై ఇంకా ఏ చర్యా లేదు

by సూర్య | Fri, Aug 05, 2022, 03:23 PM

వైసీపీ పార్టీ లో ఉండి , అందులోనూ గౌరవప్రదమైన పదవులలో ఉండి అసాంఘిక కార్యకలాపాలు చెయ్యడానికి సిగ్గు లేదా అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ప్రజలకి మేలు చేసేందుకు రాజకీయాలలో ఉండాలి తప్ప, రాజకీయాలని అడ్డుపెట్టుకొని అన్యాయాలు, అక్రమాలకు పాల్పడటం వైసీపీ నేతలకి అలవాటైపోయింది అని తెలిపారు. 


తాజాగా బయటికి వచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై స్పందిస్తూ... హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ విషయంలో నాన్చి నాన్చి సస్పెండ్ చేస్తున్నాం అని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అసభ్య వీడియో లో అడ్డంగా దొరికిన ఎంపీ పై ఇంకా ఏ చర్యా లేదు. తక్షణమే అతడితో మహిళలకు క్షమాపణ చెప్పించి అతణ్ణి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలియజేసారు. 


అక్క చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలు అంటూ తెచ్చిపెట్టుకున్న ప్రేమలు ఒలకబోయడం కాదు. ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కబెట్టకుండా వెంటనే వేటు వెయ్యాలి. ఇంకా కాలయాపన చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. 

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM