పవన్ కళ్యాణ్ అంటే జగన్ రెడ్డికి ఎందుకంత భయం ...?

by సూర్య | Thu, Jun 23, 2022, 04:04 PM

సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటన ఈ రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన నాయకులని నిర్బందించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జి వినూత కోట మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంకి వస్తున్నందున మాకు పోలీసులు నోటీసులు ఇవ్వటం అప్రజాస్వామికం. మా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు.బయట వెళ్లనివ్వకుండ అడ్డుకుంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు గురించి వినతి ఇవ్వడానికి వెళ్ళలనుకున్న మమ్మల్ని,జనసైనికులను పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య. ఇదేనా ప్రజాస్వామ్యం. జనసేన పార్టీ  అంటే జగన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నారు.కే వలం వినతి పత్రానికే భయపడిపోతే ఎలా జగన్  రెడ్డి గారు! అని ప్రశ్నించారు. 

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM