ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు

by సూర్య | Thu, Jun 23, 2022, 03:28 PM

విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటించారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని విశాఖ రాకుండా ఆగదు. సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాడ్స్ తో రక్షణ గోడ నిర్మిస్తాం అన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటార‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. దశాబ్దాలుగా ఆ వర్గాలు సామాజికంగానూ, రాజకీయంగానూ పైకి వస్తామంటే అన్ని పార్టీలు సహకరిస్తాయన్నారు. ప్రస్తుతం 26జిల్లాల బాధ్యతను అధ్యక్షుడు నాకు ఇచ్చారు….ఆ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నా అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖపట్నంను నోడల్ జిల్లాగా ఎంచుకున్నాను. కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారు. హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు. అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

Latest News

 
నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభం Tue, Jul 05, 2022, 11:28 AM
జగనన్న విద్యాకానుక ఈ రోజే మొదలు Tue, Jul 05, 2022, 11:23 AM
జగన్ పతనం ఖాయం. Tue, Jul 05, 2022, 11:20 AM
జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ Tue, Jul 05, 2022, 11:14 AM
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM