ఉత్తర ప్రదేశ్ లో విషాధం..రోడ్డు ప్రమాదంలో పదిమంది మరణం

by సూర్య | Thu, Jun 23, 2022, 03:14 PM

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా  ఉత్తరప్రదేశ్ పిలిభిత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి యాత్రికులు వెళ్తున్న వాహనం చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గజ్రౌలా పోలీస్ స్టేషన్‌లోని పురాన్‌పూర్ హైవేపై డీసీఎం వాహనం అదుపు తప్పి అదుపు తప్పి చెట్టును ఢీకొంది.


ఇదిలావుంటే ఈ విషాద ఘటనపై సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం చాలా బాధాకరం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగవంతంగా నిర్వహించి క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులకు సూచనలు చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని బరేలీకి రిఫర్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. "ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు హరిద్వార్ నుంచి తిరిగి వస్తున్న డీసీఎం వాహనం ప్రమాదానికి గురై పదిమంది మంది చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. 17 మందిలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. ఐదుగురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని బరేలీకి రిఫర్ చేశారు. మేము వారి కుటుంబాలను సంప్రదించాం." అని పిలిభిత్ జిల్లా మేజిస్ట్రేట్ పుల్కిత్ ఖరే చెప్పారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM