నాలుగోసారి విడాకులకు సిద్దమవుతున్న రూపర్ట మర్ధోక్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:13 PM

పెళ్లి పరిహారమవుతోంది. జనం చూసేందుకు అదో తంతుగా మారుతోంది. సంపన్నుడు, అమెరికాకు చెందిన మీడియా దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ నాలుగోసారి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఫాక్స్ కార్ప్ చైర్మన్ అయిన మర్డోక్ 2016 మార్చిలో సెంట్రల్ లండన్ లో జరిగిన వేడుకలో జెర్రీ హాల్ ను వివాహం చేసుకున్నారు. ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు.  ఇదిలావుంటే ఆయన 91 ఏళ్ల వయసులో నాలుగో భార్య, నటి జెర్రీ హాల్ ను కూడా ఆయన విడిచి పెట్టనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.  


విడాకుల కథనంపై ఇటు మర్డోక్ అధికార ప్రతినిధి కానీ, అటు 65 ఏళ్ల హాల్ ప్రతినిధి కానీ స్పందించలేదు. మర్డోక్, హాల్ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారే. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మర్డోక్ నెట్ వర్త్ 17.7 బిలియన్ డాలర్లు. సుమారు రూ.1.80 లక్షల కోట్లు. మర్దోక్ లోగడ మూడు వివాహాలు చేసుకోగా.. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. 

Latest News

 
ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డి భేటీ Mon, Aug 08, 2022, 07:30 PM
మిల్లర్ల పాత్ర లేకుండా చూడండి: ఏపీ సీఎం వై.ఎస్.జగన్ Mon, Aug 08, 2022, 07:28 PM
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు...ఇది పవన్ కళ్యాణ్ గ్రహించాలి Mon, Aug 08, 2022, 07:25 PM
ఏపీకి చెందిన ఆ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం Mon, Aug 08, 2022, 07:24 PM
పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి సవాల్ Mon, Aug 08, 2022, 05:25 PM