నా నియోజకవర్గానికి నేను వెళ్లితే..జగన్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో: రఘురామ

by సూర్య | Thu, Jun 23, 2022, 03:01 PM

ఏపీ సీఎం వై.ఎస్.జగన్ కు వైసీపీ ఎంపీ రఘురామకు మధ‌్య గత కొంతకాలంగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నరసాపురంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకల్ అంశంపై వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు  మాట్లాడుతూ...తాను ఆంధ్రప్రదేశ్‌ రావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, తన గ్రామంలో తన ఇంటి సమీపంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుంటే, స్థానిక లోక్‌సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్‌ అని పేర్కొన్నారు. ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైనా కాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం తాను మాత్రం హాజరు కావాలన్నారు. 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశాలకు వెళ్లొచ్చు గానీ... తాను మాత్రం సొంత నియోజకవర్గానికి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి తాను వెళ్తానంటే జగన్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం కావడం లేదన్నారు. రఘురామకృష్ణరాజు తన రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నట్లు సహచర ఎంపీలు తనకు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా జగన్ సొంతమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు సైతం సీఎం ఎలా చెబితే అలా ఆడుతున్నారని మండిపడ్డారు.


‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ విశాఖలో సమావేశం కావాల్సి ఉందని, ఈ విషయాన్ని కమిటీ సభ్యులు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా కమిటీలో రఘురామరాజు ఉంటే ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తనకు తెలిసిందన్నారు. రఘురామ విశాఖ వస్తే అరెస్ట్ చేస్తామని.. ఆ తర్వాత కమిటీ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించినట్లు ఆరోపించారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్‌ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు జగన్ దిగుతున్నారని మండిపడ్డారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM