125 ఎకరాల్లో అపాచీ పరిశ్రమ

by సూర్య | Thu, Jun 23, 2022, 12:51 PM

తిరుపతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సీఎం వైయ‌స్ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రేణిగుంట మండలం జీపాళ్యెం, ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో టీసీఎల్‌కి అనుబంధంగా రూ.1,702 కోట్లతో ఏర్పాటవుతున్న ప్యానల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ సంస్థ, సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్కులో సన్నీ ఓపోటెక్‌ ఇండియా సంస్థ రూ.350 కోట్లతో నెలకొల్పే ప్రాజెక్టు, ఇదే పార్క్‌లో ఫాక్స్‌లింక్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ రూ.355 కోట్లతో నెలకొల్పే భారీ ప్రాజెక్టులను సీఎం వైయ‌స్‌ జగన్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తంగా రూ.2,407 కోట్లతో 4,550 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా ఏర్పేడు–వెంకటగిరి రహదారిలో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద 125 ఎకరాల్లో అపాచీ నెలకొల్పుతున్న పరిశ్రమకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు. ఫాక్స్‌లింక్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ సంస్థ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టు, డిక్సన్‌ టెక్నాలజీస్‌కి చెందిన టీవీ యూనిట్‌ పనులకు కూడా సీఎం భూమి పూజ నిర్వహిస్తారు. 

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM