ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ సీఎం జగన్ తెచ్చింది కాదు

by సూర్య | Thu, Jun 23, 2022, 12:14 PM

రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ హబ్ గ మారుస్తున్నాము అని సీఎం జగన్ తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే వివిధ దేశాల నుండి పలు రకాల కంపెనీలు వచ్చినట్లు తెలియజేసారు. వచ్చిన కంపెనీలన్నిటిని కలిపి ఒక పోస్టర్ తయారు చేసి విడుదల చేసారు. ఈ విషయంపై స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.... జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ సీఎం జగన్  తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు  చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అని ఆరోపించారు. 

Latest News

 
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM
తిరుమల సమాచారం Tue, Jul 05, 2022, 10:42 AM
ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల Tue, Jul 05, 2022, 10:39 AM
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వెంకటేశ్వర్లు Tue, Jul 05, 2022, 10:35 AM
166 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత Tue, Jul 05, 2022, 10:15 AM