మాజీ మంత్రికి కరోనా పాజిటీవ్

by సూర్య | Thu, Jun 23, 2022, 12:03 AM

మళ్లీ ఏపీలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా   ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం ఆయన త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. 


2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవంతికి అవ‌కాశం దక్కింది. ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో అవంతి మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM