వైసీపీ సర్కార్ కు ఎదురుదెబ్బ...గోడ నిర్మించుకొనేందుకు అయ్యన్నకు అనుమతి

by సూర్య | Wed, Jun 22, 2022, 11:48 PM

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి కేసులో ఏపీ హైకోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఇటీవల ప్ర‌భుత్వం కూల్చేసిన గోడ‌ను నిర్మించుకునేందుకు టీడీపీ సీనియర్ నేత, అయ్య‌న్న‌ పాత్రుడికి  ఏపీ హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్యన్న‌ పాత్రుడికి ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. న‌ర్సీప‌ట్నంలో ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి అయ్య‌న్న త‌న ఇంటిని క‌ట్టుకున్నార‌ని ఆరోపిస్తూ 3 రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వ అధికారులు ఆయ‌న ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా అధికారుల‌ను అడ్డుకునేందుకు అయ్య‌న్న కుమారుడు విజ‌య్ తీవ్రంగా య‌త్నించారు. అంతేకాకుండా ప్ర‌భుత్వం, అధికారుల తీరును నిర‌సిస్తూ విజ‌య్ త‌న ఇంటిలోనే దీక్ష‌కు కూడా దిగారు. 


ఈ వ్య‌వ‌హారంపై అయ్య‌న్న‌పాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికారులు త‌న ఇంటి గోడ‌ను కూల్చివేశారంటూ ఆయ‌న త‌న పిటిష‌న్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. కూల్చేసిన గోడ‌ను తిరిగి నిర్మించుకునేందుకు అనుమ‌తించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అయ్య‌న్న త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న హైకోర్టు... ప్ర‌భుత్వం కూల్చేసిన గోడ‌ను నిర్మించుకునేందుకు అయ్య‌న్న‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను వాయిదా వేసింది.

Latest News

 
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM
కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్ Tue, Jul 05, 2022, 11:39 AM
ఏపీలో నేటి వాతావరణ సమాచారం Tue, Jul 05, 2022, 11:38 AM