దేశంలోని పరిస్థితులు మరింత దిగజారే అవకాశం: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే

by సూర్య | Wed, Jun 22, 2022, 11:48 PM

దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. ఇదిలవుంటే శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో ఆ దేశం సతమతమవుతోంది. అయితే అంతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని పార్లమెంటు సాక్షిగా ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్నారు. 


దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని... దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందని అన్నారు. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అన్నారు. పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ప్రపంచంలోని ఏ దేశం కానీ, ఏ సంస్థ కానీ శ్రీలంకకు ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేవని చెప్పారు.

Latest News

 
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM