సినిమా కోసం అమితాబ్ అలా మారిపోయారా

by సూర్య | Wed, Jun 22, 2022, 04:58 PM

సినిమాలో నటులు తమ నిజ రూపానికి దూరంగా భిన్నంగా కూడా అపుడపుడు నటిస్తుంటారు. ఇపుడు అమితాబ్ ఏదైనా విభిన్న పాత్రలో ఏదైనా చిత్రం కోసం నటిస్తున్నారా అన్న చర్చ తాజాగా సోషల్ మీడియాలో ఊపందుకొంది. ఇందుకు కారణం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోటో. ఓ ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుడు అచ్చం అమితాబ్ లాగే ఉన్నాడంటూ 2018లో ఓ ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇప్పుడా ఫొటో మరోసారి తెరపైకి వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అప్పట్లో ఆ ఆఫ్ఘన్ శరణార్థి ఫొటోను ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇప్పటికీ ఆ ఫొటో నెటిజన్లకు విస్మయం కలిగిస్తోంది. దాదాపుగా అమితాబ్ పోలీకలతోనే ఉన్న ఆ ఆఫ్ఘన్ జాతీయుడ్ని చూసి నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 


కొందరు ఆ ఫొటో చూసి అతడ్ని అమితాబే అనుకోగా, మరికొందరు అమితాబ్ తన తదుపరి చిత్రం కోసం తీయించుకున్న స్టిల్ అని భావిస్తున్నారు. ఇంకొందరు... గులాబో సితాబో చిత్రం నుంచి అమితాబ్ ఫొటో అని కొందరు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ లో అమితాబ్ ఫొటో అని మరికొందరు పొరబడ్డారు. మొత్తమ్మీద ఆ ఫొటో సోషల్ మీడియాలో మరోసారి చర్చకు తావిచ్చింది.

Latest News

 
చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: టిడిపి నేతలు Fri, Jul 01, 2022, 10:11 AM
భార్యను చంపిన భర్త.. Fri, Jul 01, 2022, 10:10 AM
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM