వారం గ‌డువు ఇవ్వండి: సీబీఐకి ఆమంచి శ్రీనివాస్ విన్నపం

by సూర్య | Wed, Jun 22, 2022, 04:57 PM

వారం గడువు ఇస్తే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికార్లకు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ కోరారు. దీనికి సీబీఐ అధికార్లు సరేనన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో బుధ‌వారం సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గైర్హాజ‌ర‌య్యారు. ముందే నిర్ణ‌యించుకున్న ప్ర‌కారం ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంద‌ని, విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు స‌మ‌యం కావాల‌ని ఆమంచి సీబీఐ కేంద్ర కార్యాయానికి స‌మాచారం చేర‌వేశారు. వారం గ‌డువు ఇస్తే విచార‌ణ‌కు రాగ‌ల‌నంటూ ఆయ‌న తెలిపారు.


ఆమంచి విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన సీబీఐ అధికారులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న‌కు గ‌డువు మంజూరు చేసిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ఏపీ హైకోర్టు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM