పంజాబ్ లో వల్లభనేని వంశీ అస్వస్థత...అక్కడే చికిత్స తీసుకొంటున్న ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jun 22, 2022, 04:56 PM

కృష్ణా జిల్లా గన్నవరం తెలుగు దేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నత విద్య కోసం పంజాబ్ రాష్ట్రానికి వెళ్లిన వల్లభనేని వంశీ.. అనారోగ్యానికి గురవడంతో వెంటనే మొహాలీలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అక్కడ ఎమ్మెల్యే వంశీకి ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అనంతరం ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో వంశీని డిశ్చార్జ్ చేస్తామని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చేస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం క్లాస్‌కు వెళ్లిన వల్లభనేని వంశీకి ఎడమచేయి లాగినట్టు అనిపిస్తుండడంతో వెంటనే స్థానికంగా ఉండే ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM