మహారాష్ట్ర కేబినేట్ సమావేశంపైనే అందరి నజర్

by సూర్య | Wed, Jun 22, 2022, 04:37 PM

ప్రస్తుతం అందరి దృష్టీ మంత్రివర్గ సమావేశంపైనే నిలిచింది. ఉద్ధవ్ థాకరే ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠతను రేపుతోంది. ఇవ్వాళ్టి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద మంత్రులతో చర్చిస్తారని, పతనం అంచుల్లో నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాల్సి ఉంటుందనే విషయం చర్చకు వస్తుందని చెబుతున్నారు. గవర్నర్‌ను కలవాలా? లేదా? అనేది ఇందులోనే నిర్ణయిస్తారని సమాచారం.


మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి సంకీర్ణ కూటమి ప్రభుత్వం పతనం అంచుల్లోనిలిచింది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏకంగా అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.


అసెంబ్లీని రద్దు చేయడంపై ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అసెంబ్లీ రద్దు చేసే అవకాశాలు లేకపోలేదంటూ శివసేనకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ రద్దు దిశగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయంటూ ఆయన కొద్దిసేపటి కిందటే ట్వీట్ చేశారు.


ఈ మధ్యాహ్నం ఒంటగంటకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కావడానికి గంటన్నర ముందు ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తిన అనంతరం మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ వెంట ఉండటం సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా అసెంబ్లీనే రద్దు చేయాలని ఉద్ధవ్ థాకరే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనితో అక్కడ రాష్ట్రపతి పాలన తప్పనిసరి అవుతుంది.


 

Latest News

 
తల్లి ముగ్గురు పిల్లలు గండి మడుగులోదూకి ఆత్మహత్య Sat, Apr 20, 2024, 01:33 PM
చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు Sat, Apr 20, 2024, 01:31 PM
ఆదరించండి అభివృద్ధి చేస్తా - చంద్రశేఖర్ Sat, Apr 20, 2024, 01:28 PM
ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన వాలంటీర్లు Sat, Apr 20, 2024, 01:15 PM
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య Sat, Apr 20, 2024, 01:05 PM