ప్రజలకి న్యాయం చెయ్యలేని ఉద్యోగమే వాలంటీర్

by సూర్య | Wed, Jun 22, 2022, 01:02 PM

దొంగ స్కీంలలో జాయిన్ చేయించాక ఆ కంపెనీ చేతులెత్తేసినప్పుడు స్కీంలో జాయిన్ చేయించిన వాళ్ళ కాలర్ పట్టుకుంటారు ఖాతాదారులు. ఇప్పడు ఏపీలో వాలంటీర్ల పరిసితి అలాగే అయ్యింది. వైసీపీకి మద్దతు ఇవ్వనివారికి ఏ ప్రయోజనాలు అందవు అంటూ నిన్నటి వరకు బెదిరించారు వాలంటీర్లు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మద్దతు ఇచ్చినా ప్రయోజనాలు ఎందుకు అందలేదని ఇప్పుడు ప్రజలే నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక చెప్పుతో తనను తాను కొట్టుకున్నాడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం రామదాస్ నాయక్ తండాకు చెందిన వాలంటీరు నగేష్ నాయక్. గ్రామంలో 50 మంది రైతులకు ఈ-క్రాప్ చేయిస్తే ఒక్క రైతుకే పంట బీమా అందింది.దీంతో మిగిలిన రైతులు వాలంటీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే "నీ ఖర్మ!"అన్నట్టు చూస్తూ ఉండిపోయారు అధికారులు.జగన్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఎలాగూ చెప్పుదెబ్బలు తప్పవని తానే తన చెప్పుతో కొట్టుకున్నాడు వాలంటీర్. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM