తిరుపతి వెళ్లనున్న జగన్

by సూర్య | Wed, Jun 22, 2022, 12:46 PM

సీఎం జగన్  గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి రూరల్‌ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొంటారు. పలు పరిశ్రమ యూనిట్‌ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. సీఎం వైయ‌స్ జగన్‌ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 నుంచి 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Latest News

 
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM